- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షంలో అద్భుతం.. పుట్టుకొచ్చిన కొత్త గ్రహం
దిశ, వెబ్‌డెస్క్: ఒక గ్రహం ఏర్పడటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు మన పాలపుంతలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి. వాటిలో ఎన్నింటి పైన జీవం ఉంది. అన్న విషయాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నాసా శాస్త్రవేత్తలకు అంతరిక్షంలో నమ్మలేని దృశ్యం కనిపించింది. అంతరిక్షంలో సరికొత్త గ్రహం ఒకటి తయారవుతోంది. దీనిని నాసా తన హబుల్ టెలిస్కోప్ ద్వారా కనుగొంది. అంతేకాకుండా ఇది జూపిటర్ (బృహస్పతి) గ్రహం కన్నా పెద్దగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
దానికి తోడుగా ఈ గ్రహం అసాధారణ పద్ధతిలో ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ గ్రహ నిర్మాణం కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న ఓ సిద్దాంతాన్ని సపోర్టు చేస్తుందని వారు తెలిపారు. 'డిస్ట్ అస్థిరత' అనే సిద్దాంతాం జూపిటర్ వంటి గ్రహాల ఏర్పాటు సంబంధించినదని, దానికి ఈ గ్రహ ఏర్పాటు మద్దతు ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను నాసా షేర్ చేసింది. ఈ గ్రహానికి ఏబీ ఔరిగేయి బీ (AB Aurigae b) నామకరణం చేశారు. ఇది జూపిటర్ కన్నా దాదాపు 9 రెట్లు పెద్దగా ఉండొచ్చని నాసా పేర్కొంది.