నాగ చైతన్య ‘తండేల్’ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల

by Anjali |   ( Updated:2024-11-06 12:38:53.0  )
నాగ చైతన్య ‘తండేల్’ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న చిత్రం ‘తండేల్’(Tandel). చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సినిమాగా వస్తానన్న తండేల్. మత్స్యకారుల జీవిత కథతో తెరకెక్కిస్తోన్న ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్(Geetha Arts Banner) లో బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి(Candū moṇḍēṭi) దర్శకత్వంలో వస్తుంది. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallavi) హీరో-హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రజెంట్ తండేల్ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే తాజాగా ఇవాళ ఈ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తండేల్ కొత్త రిలీజ్ తేదీ ప్రకటించారు. అలాగే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీ తేదీకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశాడు. ఈ వీడియోలో ఈ మూవీ ఫిబ్రవరి 7 వ విడుదల కానుందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ (Allu Arvind) మాట్లాడారు. డిసెంబరు 20 కు వస్తామనుకున్నామని అన్నాడు. కానీ పలు రీజన్స్ వల్ల ఆ తేదీ వీలుకాలేదు. సంక్రాంతికి వస్తుందని అందరూ అనుకున్నారని వెల్లడించారు. అలాగే సంక్రాంతి పండగకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. అక్కడ ఈక్వేషన్స్ డిఫరెంట్ అని.. కాగా కొత్త తేదీని తీసుకోచ్చామని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

Advertisement

Next Story