కాబోయే భార్యతో ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నాగచైతన్య.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Kavitha |
కాబోయే భార్యతో ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నాగచైతన్య.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: ‘జోష్’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం అనుకున్నంత హిట్ అయితే కాలేదు. ఆ తర్వాత ‘ఏమాయ చేశావే’ మూవీలో నటించి మెప్పించాడు. ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో చైకి జంటగా నటించిన హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. అలా కొన్నాళ్లు ప్రేమించుకున్న వీరు.. పెద్దలనొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, పట్టుమని నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండా ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక వీరి డివోర్స్ అయినప్పటి నుంచి చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు పలు రూమర్లు వచ్చాయి.

అంతేకాక వారిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటిని నిజం చేస్తూ ఆగస్టు 8న వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకొని సడన్ షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున X వేదికగా ప్రకటిస్తూ చైతన్య- శోభితల నిశ్చితార్ద ఫొటోలు షేర్ చేశాడు. దీంతో ఈ జంటకు అక్కినేని అభిమానులు శుభాకాంక్షలు, సమంత ఫ్యాన్స్ చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.

తాజాగా నాగచైతన్య- శోభిత ధూళిపాళ కలిసి లిఫ్ట్‌లో ఉన్న పిక్‌ను చై ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. అందులో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో స్టైయిల్‌గా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. అంతేకాకుండా ‘ప్రతిచోటా అన్నీ ఒకేసారి’ అనే క్యాప్షన్ కూడా జోడించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానున్నట్లు టాక్.

(video link credits to nagachaithanya instagram id)

Advertisement

Next Story

Most Viewed