ఆ విషయంలో నాగచైతన్య చాలా సెంటిమెంటల్

by S Gopi |   ( Updated:2022-07-14 12:53:54.0  )
ఆ విషయంలో నాగచైతన్య చాలా సెంటిమెంటల్
X

దిశ, సినిమా : విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'థాంక్యూ'. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న సినిమాలో నాగచైతన్య మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌‌ చూస్తుంటే తన జీవితంలోని మూడు ప్రేమ కథలను ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చైతు సమాధానమిచ్చారు. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు క్రాస్ రోడ్స్ థియేటర్స్‌లో హంగామా చేస్తామన్న ఓ ఫ్యాన్.. ఈసారి తను కూడా రావాలంటూ చైతన్యను రిక్వెస్ట్ చేశాడు. ఇందుకు బదులిచ్చిన చై.. తానెప్పుడూ థియేటర్లకు వెళ్లనని, అదొక సెంటిమెంట్‌ అని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఫ్యాన్స్ మళ్లీ, మళ్లీ అదే ప్రశ్న అడగడంతో సెంటిమెంట్‌ను బ్రేక్ చేయనని స్పష్టం చేశాడు. ఇంతలో మైక్ తీసుకున్న దిల్ రాజు.. ఆ టాపిక్ స్కిప్ చేస్తూ చైతుపై ఓ డైలాగ్ వేశాడు.

Advertisement

Next Story