మ‌రో అంతుప‌ట్ట‌ని వ్యాధి.. 13 కేసులు న‌మోదు, ముగ్గ‌రు మృతి

by Sumithra |
మ‌రో అంతుప‌ట్ట‌ని వ్యాధి.. 13 కేసులు న‌మోదు, ముగ్గ‌రు మృతి
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కరోనావైరస్ (COVID-19) క‌ల‌వ‌రం ప్రపంచాన్ని ఇంకా వీడ‌నే లేదు. ఈ మ‌హ‌మ్మారి ల‌క్ష‌ల మందిని చంపింది, అంతకుమించి, ఎంతో మందిని దీర్ఘకాల కోవిడ్‌తో వదిలేసింది. త‌ర్వాత, వివిధ దేశాల‌ను భ‌య‌కంపితుల్ని చేసిన‌ మంకీపాక్స్ వైరస్ కూడా ప్రపంచమంతటా విస్తరిస్తూ మ‌రో క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. అయితే, తాజాగా టాంజానియాలో ఓ అంతుబ‌ట్ట‌ని అనారోగ్యం అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యింది. ఇప్ప‌టికే కనీసం ముగ్గురి ప్రాణాలు తీసిన ఈ ఘోరమైన మిస్టరీని ఛేదించ‌డానికి ప్ర‌స్తుతం టాంజానియాలోని వైద్య నిపుణులు ఈ అనారోగ్యంపై దర్యాప్తు చేస్తున్నారు. వార్తా సంస్థ AFP జూలై 13న ఈ విష‌యాన్ని నివేదించింది. అంతుబ‌ట్ట‌ని ఈ వ్యాధిని అర్థం చేసుకోడానికి, మరింత విశ్లేషించడానికి ఆరోగ్య నిపుణులు, వైద్యుల బృందాన్ని పరిశోధించడానికి పంపినట్లు ఈ ప్రభుత్వం తెలిపింది.

ఇక‌, ఈ మిస్ట‌రీ వ్యాధితో మరణించిన ముగ్గురు వ్యక్తులతో సహా, లిండి ప‌ట్ట‌ణ ఆగ్నేయ ప్రాంతంలో ఇప్పటివరకు 13 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఐఫెల్లో సిచల్వే ఒక ప్రకటనలో తెలిపారు. రోగులకు ఎబోలా, మార్బర్గ్‌తో పాటు కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌గా నెగెటీవ్ వ‌చ్చింద‌ని, రోగుల్లో ఒకరు పూర్తిగా కోలుకున్నారని, ఇతరులు ఐసోలేష‌న్‌లో ఉన్నారని సిచల్వే చెప్పారు. అయితే, ఈ వ్యాధి లక్షణాలను ప‌రిశీలిస్తే, రోగులకు జ్వరం, విపరీతమైన తలనొప్పి, ఆయాసం, ముఖ్యంగా ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నాయని నిపుణులు వెల్లడించారు. పర్యావరణ కాలుష్యం ఫలితంగా మానవులు, అడవి జంతువుల మధ్య "పెరుగుతున్న పరస్పర చర్య" కారణంగా లిండిలో కనిపించిన ఈ "వింత" వ్యాధి సంభవించి ఉండొచ్చని టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహు హసన్ మంగళవారం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed