- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షంలో 'గుండె చప్పుడు': శూన్యంలో ఈ విచిత్ర రేడియో సిగ్నల్స్ ఎవరివి?!
దిశ, వెబ్‌డెస్క్ః భూమికి మించిన జీవం గురించి మనకు ఇంకా ఖచ్చితమైన రుజువు ఏదీ లేదు, తెలియదు. అయితే, ఏలియన్ నాగరికతను సంప్రదించడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ అలాంటి నాగరికతలు ఏవైనా ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ ఆ గ్రహాంతరవాసుల నుండి మనకు ఎలాంటి సమాచారం కాని, స్పందన కానీ లేదు. అయితే, మనం ఎలా వారిని కలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామో, ఏలియన్స్ కూడా మనల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు కూడా! ఇలాంటి ఆలోచన కాస్త చమత్కారంగానే ఉండొచ్చు. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు విశ్వంలో కొన్ని విచిత్ర శబ్ధాలు గమనించారు. రేడియో సిగ్నల్ వంటి 'హార్ట్ బీట్' లాంటి సౌండ్‌లు US, కెనడాలోని యూనివర్సిటీలు గుర్తించాయి. సుదూర గెలాక్సీ నుండి వస్తున్న ఈ రేడియో సిగ్నల్ ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఎక్కువ సమయం, ఒక క్రమబద్ధతతో రావడం పరిశోధకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇటువంటి సంకేతాలను ఫాస్ట్ రేడియో బరస్ట్స్ లేదా FRB అంటారు. సాధారణంగా, FRBలు కొన్ని మిల్లీసెకన్ల వరకు ఉంటాయి. కానీ, ఈ FRBలు మాత్రం సాధారణం కంటే 1000 రెట్లు ఎక్కువ కాలం పాటు వినిపించడం మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ బరస్ట్‌లు ప్రతి 0.2 సెకన్లకు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సౌండ్ సరిగ్గా కొట్టుకునే గుండెను పోలి ఉండటం గమనార్హం. ఈ FRBని శాస్త్రవేత్తలు FRB 20191221Aగా నామకరణం చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ కాలం ఉన్న FRB ఇది మాత్రమే! ఈ రేడియో సంకేతాలు బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నుండి వస్తున్నట్లు గుర్తించారు. రేడియో బరస్ట్స్ మూలం తెలియదు కానీ రేడియో పల్సర్ లేదా మాగ్నెటార్ ఈ సిగ్నల్‌ను విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
MITకి చెందిన కవ్లీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ స్పేస్ రీసెర్చ్‌లో పరిశోధకునిగా ఉన్న డానియెల్ మిచిల్లి దీని గురించి వివరించారు. "విశ్వంలో చాలా విషయాలు ఖచ్చితంగా ఆవర్తన సంకేతాలను విడుదల చేయట్లేదు. మన స్వంత గెలాక్సీలో మనకు తెలిసిన ఉదాహరణలను బట్టి రేడియో పల్సర్‌లు, మాగ్నెటార్‌లు.. లైట్‌హౌస్‌కు సమానమైన కిరణాల ఉద్గారాల్లా తిరుగుతాయి, వాటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కొత్త సిగ్నల్స్ అనేవి స్టెరాయిడ్స్‌పై మాగ్నెటార్ లేదా పల్సర్ కావచ్చునని మేము భావిస్తున్నాము" అని అన్నారు. ఈ ఆవిష్కరణ నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.