Hijab: నీట్ పరీక్షా కేంద్రం వద్ద ముస్లిం విద్యార్థినులకు అవమానం

by S Gopi |   ( Updated:2022-07-18 10:03:14.0  )
Muslim NEET Aspirants Face Trouble at Exam Centre for wearing hijab
X

జైపూర్: Muslim NEET Aspirants Face Trouble at Exam Centre for wearing hijab| నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ముస్లిం విద్యార్థినులకు పరాభావం ఎదురైంది. కాలేజీ ఎంట్రెన్స్ దగ్గరే పోలీసులు వాళ్లని అడ్డుకున్నారు. హిజాబ్‌లను తీసివేసి పరీక్షా కేంద్రాల్లో హాజరుకావాలని సూచించారు. దీంతో దానికి సమ్మతించని ముస్లిం విద్యార్థినులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటా పట్టణం, మహారాష్ట్రలోని వాసిమ్ ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2022 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించింది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులను అనుమతించేటప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు, అధికారులు తప్పనిసరిగా పాటిస్తారు.

ఈ క్రమంలో ముస్లిం విద్యార్థినులు తమ హిజాబ్‌లను తీసివేసి పరీక్షలు రాయాలని అధికారులు తెలిపారు. అయితే కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసివేసి.. నార్మల్ డ్రెస్‌‌లో పరీక్షలు రాయడానికి వెళ్లిపోయారు. కానీ మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. దీంతో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఆందోళన జరిగింది. ముస్లిం వర్గ ప్రజలు భారీగా గుమిగూడారు. అనంతరం హిజాబ్‌లను తొలగించాలని బలవంతం చేశారని ముస్లిం విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పరీక్షా కేంద్రాల దగ్గరికి చేరుకుని అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎన్‌టీఏ మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థులు సాధారణ దుస్తువులు ధరించాలి. స్లీవ్ లెస్ దుస్తువులు ధరించకూడదు. సంప్రదాయ పరమైన దుస్తువులు ధరించవచ్చు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద కనీసం రెండు గంటల ముందు రావాలని నివేదికలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: మోడీ సమక్షంలో జగదీప్ ధన్కర్ నామినేషన్

Advertisement

Next Story

Most Viewed