- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మున్సిపల్ చైర్ పర్సన్
దిశ, శంకర్ పల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. శంకర్పల్లి శాఖ గ్రంథాలయాన్ని ఆమె బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. చైర్ పర్సన్ సందర్శించిన సమయంలో గ్రంథ పాలకుడు లేడు. దాంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రంథ పాలకుడు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు.
పూర్తిస్థాయి గ్రంథ పాలకుడు లేకపోవడం, అతడు లేకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంచడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉద్యోగస్తులకు అనుకూలమైన గ్రంథాలయ వేళల్లో గ్రంథాలయం తెరిచి ఉంచాలని ఆమె సూచించారు. ఉదయం 8:30 నుంచి 11:30 సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు తెరిచి ఉంచితే అందరికీ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఉపయోగపడే కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయం లో కొత్తగా సభ్యుల సభ్యత్వ నమోదు కూడా చేయడం లేదని కేవలం గ్రంథాలయం అటెండర్ వరకే పరిమితం అయింది అని ఆమె గుర్తించారు. ఇక్కడ పని చేయాల్సిన గ్రంథాలయం గ్రంథ పాలకుడు సక్రమంగా విధులకు హాజరయ్యే లా చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.