- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న జీయర్ స్వామిపై సీతక్క ఫైర్.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరను చిన్న జీయర్ స్వామి అవమానించారంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జాతరపై బిజినెస్ చేస్తున్నారంటూ జీయర్ స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపింది. దీనిపై స్పందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.. తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. '' ఓ ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు. మా తల్లులది వ్యాపారమా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు.
కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూడడానికి మాత్రం 150 రూపాయలు. బేషరతుగా చిన్న జీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి. తల్లుల కీర్తి ప్రతిష్టలను సహించలేక మాట్లాడిన దుర్మార్గపు మాటలను వెనక్కి తీసుకోవాలి. దీనిపై సీఎం కేసీఆర్ కూడా స్పందించాలి. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న సమక్క సారక్క కీర్తిని తగ్గించి మాట్లాడిన విధానాల మీద తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలి.'' అంటూ సీతక్క వీడియోలో తెలియజేశారు.
ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు మా తల్లులది వ్యాపారమా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు pic.twitter.com/SB3O06HUg3
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) March 16, 2022