- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయం సీఎంకు గుర్తుకు లేదా.. ఆర్టికల్ 3పై ఎంఆర్పీఎస్
దిశ, శాయంపేట : రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ వచ్చిందన్న విషయం సీఎంకు గుర్తులేదా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. బుధవారం హన్మకొండ జిల్లా, శాయంపేట మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరం కాదని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని కించపరిచిన కేసీఆర్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.
రాజ్యాంగం జోలికి వస్తే రాజకీయాలు మారిపోతాయని.. అందుకు తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏప్రిల్ 9న హైదరాబాద్‌లో చేపట్టే యుద్ధభేరి మహా ప్రదర్శనకు భారీ ఎత్తున తరలి రావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంద రాజు, రాష్ట్ర నాయకులు మస్తే సదయ్య, పాముల సుబ్బయ్య, ముక్కెర ముఖేష్, గోనెల రమేష్, గజ్జి ఐలయ్య, మంద నరేష్, కొండపాక స్వరూప, పాముల రజిత, మారపెల్లి రవీందర్, చింతల భాస్కర్, మామిడి భాస్కర్, పోతుగంటి రాజినీకర్ తదితరులు పాల్గొన్నారు.