Uttam Kumar Reddy: మేము ధర్నాలు చేయకూడదా.. వెంటనే వారిని విడుదల చేయండి: ఉత్తమ్

by GSrikanth |   ( Updated:2022-04-07 05:50:44.0  )
Uttam Kumar Reddy: మేము ధర్నాలు చేయకూడదా.. వెంటనే వారిని విడుదల చేయండి: ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధ భవన ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మరి కొందరిని గృహ నిర్బంధం చేశారు. దీనిపై మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని ఖండించారు. విపక్ష పార్టీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్యుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రోడ్లు దిగ్బంధం చేస్తారా? మేము ధర్నాలు చేయకూడదా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed