- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎంపీ రంజిత్‌రెడ్డి
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యా, వైద్య రంగాలపై దృష్టి పెట్టిందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఆ దిశగానే జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఎంపీ సూచించారు. ఆదివారం ఎంపీ రంజిత్‌రెడ్డి జూమ్మీటింగ్ద్వారా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షన కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి దాతల ద్వారా విరాళాలు సేకరించి పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని తెలిపారు. పాఠశాలలో అవసరమయ్యే మరుగుదొడ్లు నిర్మించి, త్రాగునీరు, అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్, తదితర పనులు చేపట్టి విద్యార్థులు బాగా చదువుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వైకుంఠ ధామాలు, రోడ్లు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, నర్సరీలు వంటి అభివృద్ధి పనులను కూలీల ద్వారా పనులు కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర బృందం రంగారెడ్డి జిల్లాకు వచ్చి ఆకస్మిక తనిఖీలు చేసి అభివృద్ధి పనుల పురోగతికి సంతృప్తి వ్యక్తం చేసినందున సంబంధిత అధికారులను ఎంపీ రంజిత్ రెడ్డి అభినందించారు. చేవెళ్లలో బ్లడ్ బ్యాంక్ లేదని వెంటనే ఏర్పాటు చేయాలని యాక్సిడెంట్లు, ప్రసవాలు వంటి కేసులు వచ్చినప్పుడు సిటీకి రావడం కష్టం అవుతుంది అని తెలిపారు. వెంటనే చేవేళ్లలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని జిల్లా వైద్య శాఖ అధికారి తెలిపారు. జిల్లాకు నూతనంగా 21 బస్తీ దవాఖానాలు మంజూరు అయ్యాయని తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను క్యాంపుల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు.
పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతతో కూడిన, పిల్లలు తినే విధంగా ఉండాలని ఎల్.పిజి ద్వారా వడ్డించే ప్రయత్నాలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావును ఎంపీ ఆదేశించారు. కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి రిజెక్ట్ చేసినప్పుడు సరైన కారణాలు తెలపాలని జిల్లా సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. అంగన్ వాడి కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించి, షాబాద్ చేవెళ్ల, యాచారం, కందుకూర్ మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలను రెనోవేషన్ చేశామని జిల్లా సంక్షేమ అధికారి మోతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించే దిశగా నోటిఫికేషన్లు ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి అవసరమయ్యే గ్రూప్-I, గ్రూప్ -II, బ్యాంకింగ్ శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాలను చిలుకూరులో ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని డీఆర్డీవోకు ఎంపీ సూచించారు. చిలుకూరులో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఎంపీ రంజిత్ రెడ్డికి తెలిపారు. రైతు వేదికలను రైతులకు అందుబాటులో ఉంచి వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతా రెడ్డిని ఆదేశించారు. రైతులు పండించిన పంటను ఈనామ్ ద్వారా పంటలను విక్రయించేలా చర్యలు చేపట్టాలని మార్కెట్ శాఖ అధికారులను ఆదేశించారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వర్షాలు పడినప్పుడు రోడ్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని జల్ పల్లి మున్సిపాలిటీ పరిధీలో రోడ్ వైండింగ్ చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారి ధర్మారావును ఆదేశించారు. ఈ జూమ్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు గాంధీ, జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, జిల్లా అధికారులు తదితలురు పాల్గొన్నారు.