నా తమ్ముడితో నాకు సంబంధం లేదు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
నా తమ్ముడితో నాకు సంబంధం లేదు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు అని, ఒక ఇంటిలో గొడవలు ఉండటం సాధారణమేనని, తాను మాత్రం కాంగ్రెస్‌ను వీడలేనని, చివరి శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలనేవి మొగుడు పెళ్లాల మధ్య ఉన్న గొడవ లాంటివని, సమయానుకూలంగా అన్ని అంశాలు సర్దుకుంటాయన్నారు. తన సోదురుడు, ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి అభిప్రాయాలతో తనకేలాంటి సంబంధాలు లేవని, ఆయన అభిప్రాయం ఆయనదేనన్నారు. తాను ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారతానని అనడానికి సంకేతం కాదని, సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకే ప్రధానిని కలిసానని, భవిష్యత్తులోను ప్రధానిని కలుస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను చివరి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు.

ప్రగతిభవన్​ గురించి ఎందుకు రాయరు

కాంగ్రెస్‌లో కంటే బీజేపీ, టీఆర్ఎస్‌లోనే అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నాయని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌లో విభేదాల గురించి మీడియా రాయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు సొంత మీడియా, డబ్బులు లేవు కాబట్టే వ్యతిరేకంగా రాస్తారని అన్నారు. అనంతరం సమయంలో రైతుల పంటలను కొనుగోలు చేసి రైతులకు బోనస్ ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎకరానికి పదివేల పెట్టుబడి పెరిగిందని, పెట్టుబడి పెరుగడంతో ప్రభుత్వం బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని, పంట ధాన్యం కొనుగోలు చేతకాకపోతే కేసీఆర్ తప్పుకోవాలన్నారు. కేసీఆర్‌కు ధాన్యం కొనుగోలు చేయడం చేతగాకపోతే తనకు, రేవంత్ రెడ్డికి అప్పగిస్తే మద్దతు ధరతో కొనుగోలు చేసి చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఛత్తీస్‌గడ్‌లోలా క్వింటాకు రూ.2500 ఇస్తామని, ఛత్తీస్‌ఘడ్‌లో తమ కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్‌కి తన అభివృద్ధి మాత్రమే ముఖ్యమని ఆయన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed