- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ మరో కుట్రకు తెరలేపారు: ఎంపీ బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అమెరికాలోని ప్రవాస భారతీయులతో 'ఏక్ దక్కా – తెలంగాణ పక్కా' అనే అంశంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారని, యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అథో:గతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అన్ని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి, నియంత కుటుంబ పాలనను అంతమొందించి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా యుద్దం చేస్తున్నామని చెప్పారు.
గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించి తీరుతామని పునరుద్ఘాటించారు. బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమంలో ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతల అవినీతి బండారంపై న్యాయ, క్షేత్రస్థాయి పోరాటాలు చేస్తున్నామన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యం అని అన్నారు. గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని కాపాడి మాతృ భూమి రుణం తీర్చుకోవాలని సూచించారు. కేంద్రాన్ని బదనాం చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించేందుకు సీఎం మరో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న ప్రవాసులంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మహోద్యమంలో జైళ్ల పాలై ఇబ్బంది పడుతున్న బీజేపీ కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.