MP Arvind: ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ను చేయండి.. మంత్రి కేటీఆర్‌పై ఎంపీ అర్వింద్ ఫైర్

by Vinod kumar |   ( Updated:2022-06-28 10:32:45.0  )
MP Arvind writes a letter to CM KCR demanding to announce Poorna As Telangana Brand Ambassador
X

దిశ, తెలంగాణ బ్యూరో : MP Arvind writes a letter to CM KCR demanding to announce Poorna As Telangana Brand Ambassador| మంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఫైరయ్యారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి మోసం చేసింది నీ తండ్రేనని, అది కూడా తెలియకుండా కామెంట్స్ చేసే ఆయన ఒక బేవకూఫ్ అని అర్వింద్ మండిపడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌కు చెందిన మాలోత్ పూర్ణ 13 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిందని, ప్రపంచంలోని ఎత్తైన 7 పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టి చిందన్నారు. అర్వింద్ ఫౌండేషన్ ద్వారా పూర్ణకు రూ.3.51 లక్షలు అందజేశారు. పూర్ణని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాసినట్లుగా అర్వింద్ వెల్లడించారు.

2014లో సానియామీర్జాను తెలంగాణ అంబాసిడర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పటికైనా తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన పూర్ణను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేస్తామని బీజేపీ ఏనాడూ చెప్పలేదని, అయినా తాము చేసినట్లుగా చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా లేకుండా పోయిందని ఫైరయ్యారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే ఆమెకు కాకుండా గిరిజనేతరులకు కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి సొంత గ్రామంలోనే కరెంట్ లేదు అన్న ప్రశ్నకు అర్వింద్ స్పందిస్తూ తెలంగాణలోని పలు గ్రామాలు తప్ప దేశమంతా కరెంట్ ఉందని తెలిపారు.

రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు తొలి మెట్టు అని, ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం పొత్తు పెట్టుకుంటాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ లో చేరుతున్న వారికి, చేరబోయే వారికి చిప్ప గతి పట్టడం ఖాయమని తెలిపారు. మంత్రి కేటీఆర్ తెలంగాణకు రావాల్సిన నిధులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఆయన బతుకు ఎడమకాలి చెప్పుతో సమానమని మండిపడ్డారు. బీజేపీ సిద్ధాంతాలు టీఆర్ఎస్ కు వంద శాతం ప్రమాదకరమని, అందుకే బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలను ఈడీ విచారణ చేపట్టడం పై గతంలో సీబీఐ ప్రధాని మోడీ, అమిత్ షాను తీసుకెళ్లి విచారణ చేయలేదా అని వెల్లడించారు.

బీజేపీ నేతలు పొలిటికల్ టూరిస్టులైతే సీఎం కేసీఆర్ ఆయన ఫొటోను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెట్టుకున్నాడని, అయినా ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. దేశ్ కీ నేత పెడుతున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే పొలిటికల్ టూరిస్ట్ అని అంటున్నారని, మరి తెలంగాణ ముఖ్యమంత్రికి ఒరిస్సా, కర్ణాటక వెళ్తే దాన్ని ఏమంటారని అర్వింద్ ప్రశ్నించారు. తెలంగాణలో 2/3 వంతు మెజారిటీతో గెలుస్తున్నామని అర్వింద్ ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed