- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Arvind: 'నాపై దాడి చేయించింది ఆ ఎమ్మెల్యేనే'.. ఎర్దండి ఎటాక్‌పై ఎంపీ అరవింద్ ఫైర్
దిశ, కోరుట్ల: MP Arvind Reacts Over Attack On his In Erdandi Village| తెలంగాణలోని టీఆరెఎస్ ఎమ్మెల్యేలంతా దోపిడిదారులుగా తయారయ్యాయరని, ఏమైనా అంటే బీజేపీ వాళ్ల కార్ల అద్దాలు పలగొడ్తామని, రాళ్లు విసురుతామంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో తనపై జరిగిన దాడిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని, సహనాన్ని పరీక్షించవద్దన్నారు. ఎర్దండి గ్రామం గోదావరి వరదలతో ముంపునకు గురైందని.. నష్టపోయిన ప్రాంతాన్ని సందర్శించేందుకు వెల్తుండగా 10 మంది టీఆరెఎస్ వాళ్లు అడ్డుకున్నారన్నారు. గ్రామానికి చెందిన వారికి 465 పట్టాలు 30 ఏళ్ల క్రితం ఇచ్చారని, ముంపునకు గురి కాని ప్రాంతంలోని స్థలాన్ని కేటాయించారన్నారు. బీజేపీ నేత సీ హెచ్ విద్యాసాగర్ హయాంలో 104 సర్వే నెంబర్‌లో 70 ఎకరాల భూమిలో 30 ఎకరాల్లో పట్టాలు ఇవ్వగా, నిర్మల్ ప్రాంతంలో ఎస్సారెస్పీ ద్వారా ముంపునకు గురైన ఆరుగురికి 27 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ఎర్దండి గ్రామానికి చెందిన వారికి నివేశన స్థలాల కోసం కేటాయించగా, నిర్మల్ ఎస్సారెస్పీ ముంపు బాధితులకు వ్యవసాయం కోసం కేటాయించారని అరవింద్ పేర్కొన్నారు.
ఎస్సారెస్పీ ముంపు బాధితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి బంధువులు అయినందన వీరికి రోడ్డు సైడ్ భూమి ఇవ్వాలంటున్నారని, రోడ్డు సైడ్ నివేశనా స్థలాలు అలాట్ అయిన గ్రామస్థులు వెనక్కి వెళ్లాలని అంటున్నారని ఎంపీ ఆరోపించారు. దీని కంటే అన్యాయం ఏమైనా ఉంటుందా, దీనిని దొరతనం అంటారని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు 27 ఎకరాల్లో ఎంత శాతం వేసుకపోదామనుకున్నారో విచారణ జరగాలని వ్యాఖ్యానించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చుట్టాలు కాబట్టి వారికి రోడ్డు పక్కన వ్యవసాయ భూమిని ఇచ్చి వెనక ఇండ్లు కట్టుకోవాలంటుడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విషయంపై తాను గ్రామానికి వెళ్తే తనను అడ్డుకుని ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేని పట్టాల గురించి ఎంపీ రావద్దని మూడు కార్లు పగలగొట్టారన్నారు. దీనివల్ల తనకు జరిగే నష్టం ఏమీ లేదని ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకుంటానని అలా కూడా ప్రజా ధనం వృధా అవుతుందన్నారు. ఒక్క రోజుల తీరే సమస్యను జఠిలం చేస్తున్నారన్నారని, 460 కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని విధంగా మంత్రి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని అరవింద్ ఆరోపించారు. భౌతిక దాడులు చేయడానికి అర్థం లేదని, యువతను తనపై దాడికి ఎగేసింది స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావేనని ఆరోపించారు.
ముంపు ప్రాంతాల పరిశీలన..
కోరుట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను ఎంపీ అరవింద్ పరిశీలించారు. వరదతో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ఆరంభంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అర్థం చేసుకోవాలన్నారు. కోరుట్ల పట్టణంలో కాలువకు, చెరువుకు కనెక్టివిటీ చేస్తే వరద సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. చాలా సంవత్సరాలుగా ఈ పని చేయడానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చెరువు, కాలువ కనెక్టివిటీ చేసే ప్రాంతాన్ని కొంతమంది కబ్జా చేశారని వారికి టీఆరెఎస్ వాళ్లు కాపలా కాస్తున్నారని అరవింద్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ఎంపీ అర్వింద్‌ను అడ్డుకున్న ఎర్దండి గ్రామస్తులు (వీడియో)
- Tags
- MP Arvind