- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగను పట్టించిన దోమ!
దిశ, ఫీచర్స్ : చైనా, ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇటీవలే ఓ దొంగతనం జరిగింది. అయితే ఆ దొంగను పట్టుకోవడంలో దోమ రక్తం పోలీసులకు ఉపయోగపడటం విశేషం. ఇదేదో 'సీఐడీ' సీరియల్ కోసం తెరకెక్కించిన కథాంశంలా ఉందని అనిపిస్తుందా? అస్సలు నమ్మలేకపోతున్నారా? కానీ చైనాలో జరిగిన యథార్థ సంఘటనే ఇది.
ఫుజౌలోని ఓ అపార్ట్‌మెంట్‌లోనికి బాల్కనీ ద్వారా ప్రవేశించిన దొంగ ఒకరి ఫ్లాట్‌లోకి దూరాడు. ఈ క్రమంలో అతడు వంటగదిలో మిగిలిపోయిన నూడుల్స్, ఎగ్స్‌ను తిన్నాడు. ఆ తర్వాత వార్డ్‌రోబ్ నుంచి దుప్పట్లు తీసుకుని కాసేపు అక్కడే నిద్రించిన దొంగ ఈ సమయంలో అగరుబత్తీలు కూడా కాల్చడంతో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన కొంత సమయం అక్కడే గడిపినట్లు పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో సంఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించిన అధికారులు, గోడపై చనిపోయిన దోమ రక్తపు మరకలను గమనించారు. ఆ రక్తాన్ని విశ్లేషిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని భావించడంతో ఆ శాంపిల్స్‌ను ల్యాబ్‌కి పంపించారు. కాగా డీఎన్‌ఏ పరీక్షల్లో ఆ రక్తం చాయ్ అనే ఇంటిపేరుతో కూడిన వ్యక్తికి చెందినదని తేలింది. ఆ వ్యక్తి విస్తృతమైన నేర చరిత్రను కలిగి ఉన్నవాడు కాగా దోపిడీ జరిగిన 19 రోజుల తర్వాత పోలీసులు చాయ్‌ను పట్టుకుని విచారణకు తీసుకొచ్చారు. విచారణలో చోరీకి పాల్పడినట్లు అతడు అంగీకరించడంతోపాటు మరో మూడు చోరీ కేసుల్లోనూ తన ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు.