- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగ్గారెడ్డి దారెటు..? ఇరకాటంలో ఆయన సతీమణి
దిశ ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్‌పార్టీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసోడ్ కొత్త మలుపులు తిరుగుతోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం, ఆయన రేవంత్పైమరింత ఘాటుగా విమర్శలు చేయడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్పార్టీలోనే ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్పిన ఆయన.. తను ఏంటో చూపిస్తానని సవాల్‌చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు జగ్గారెడ్డి ఏం చేయనున్నారు..? తన అడుగులు ఎటువైపు పడనున్నాయనే అంశంపై కాంగ్రెస్‌పార్టీలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.మరోవైపు తాజా ఘటనలతో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అయోమయంలో పడిపోయారు.
జగ్గారెడ్డి సతీమణి నిర్మల ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. జగ్గారెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తే నిర్మల కూడా తప్పుకున్నట్లే లెక్కగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులపై రాజకీయంగా, మరో వైపు జిల్లా కాంగ్రెస్‌లో విస్త్రత చర్చ జరుగుతోంది. తాను కాంగ్రెస్‌ను వీడబోనని ఇటీవలే ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా మీడియా సమక్షంలో తిరిగి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తాను పార్టీలోనే ఉండాలనుకుంటున్నా ( వెళ్లగొడితే ఏం చేయలేం అనే అర్థం వచ్చేలా) అని జగ్గారెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
కాంగ్రెస్అధినేత్రి సోనియా, యువనేత రాహుల్‌గాంధీని కలిసి వచ్చిన తరువాత పార్టీలోఉండాలో.. బయటకు పోవాలో నిర్ణయం తీసుకుంటానని ఇది వరకే ఆయన ప్రకటన చేశారు. అయితే ఢిల్లీలో వాళ్ల అపాయింట్మెంట్ లభించకపోవడంతో జగ్గారెడ్డి ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇక తన సత్తా ఏమిటో నిరూపించడానికి సంగారెడ్డిలోని అంబేద్కర్మైదానంలో లక్ష మందితో మార్చి 21న భారీ బహిరంగ సభ పెడతానని కూడా ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆ సభను వాయిదా వేసుకున్నారు. ఇంతలోనే ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం జగ్గారెడ్డి పార్టీలో కార్యకర్తగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా రేవంత్‌పై మరింత తీవ్ర స్థాయిలో ఘాటుగా విమర్శలు చేయడంతో అధిష్టానం జగ్గారెడ్డిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నదా..? అనే కోణంలో కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అధిష్టానం సీరియస్‌గా జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటే ఆయన ఏ పార్టీలోకి వెళతారు..? జగ్గారెడ్డి పయనమెటు..? అనే అంశాలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జగ్గారెడ్డి ఎపిసోడ్‌లో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో వేచి చూడాల్సి ఉంది.