ఉక్రెయిన్ నుంచి 22,500పైగా పౌరుల తరలింపు: రాజ్యసభలో విదేశాంగ మంత్రి

by Harish |
ఉక్రెయిన్ నుంచి 22,500పైగా పౌరుల తరలింపు: రాజ్యసభలో విదేశాంగ మంత్రి
X

న్యూఢిల్లీ: యుద్ధభూమి ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 22,500 కు పైగా భారతీయులను వెనక్కి తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. మంగళవారం ఆయన రాజ్య సభలో ప్రసంగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళన పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొని 22,500కు పైగా పౌరులను సురక్షితంగా దేశానికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆదేశాలతో ఆపరేషన్ గంగా మిషన్ చేపట్టి, తరలింపు ప్రక్రియను సవాల్‌గా తీసుకున్నాం. మన పౌరులు రవాణా వసతుల లేమితో ఇబ్బందులు పడ్డారు' అని తెలిపారు. ఉక్రెయిన్‌లో వైమానిక దాడులు, షెల్లింగ్ కొనసాగుతున్న సమయంలో ఈ మిషన్ అమలు చేశామని చెప్పారు. ఇది కొన్ని సమయాల్లో 1000 కిలోమీటర్ల మేర ప్రయాణించినప్పటికీ సరిహద్దుల్లో ఆగిపోయారన్నారు. ప్రభుత్వమే అధికారులతో మాట్లాడి తరలింపు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సుమీ ప్రాంతంలోని విద్యార్థులను తరలించడంలో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోడీ మాట్లాడినట్లు తెలిపారు. పౌరుల తరలింపు కోసం రేయింబవళ్లు సంబంధిత అధికారుల పర్యవేక్షించినట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed