- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ జాగీరా.. వీళ్లు పాలకులా.. నియంతలా..?
దిశ, తిమ్మాపూర్ : తెలంగాణ రాష్ట్రం కేసీఆర్, కేటీఆర్‌ల జాగీరు కాదని, అసలు వీళ్లిద్దరూ ప్రజలు ఎన్నుకున్న పాలకులా లేక నియంతలా అర్థం కావడం లేదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ శ్రేణుల అక్రమ అరెస్ట్‌లను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటే.. ఈ అక్రమ నిర్బంధాలు ఉండవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రతిపక్షాలను దిగ్భంధించడం పద్ధతి కాదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీలో గలాట సృష్టించినా, స్పీకర్ వెల్ లోకి వెళ్లినా, సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రజా రంగ వ్యవస్థకు ఆటంకం కలిగించినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు ఇలా అక్రమంగా అరెస్టులు, నిర్బంధాలు చేయలేదని, అలా చేస్తే వీళ్లు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండకపోయే వారని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పాలకులు కళ్లు తెరిచి ప్రతిపక్షాల అభ్యంతరాలను, వినతులను, విజ్ఞప్తులను అధికార గర్వంతో కాకుండా హుందాతనంగా సహృదయంతో స్వీకరించాలన్నారు. అప్పుడే ప్రతిపక్షాలకు, ప్రజలకు ప్రభుత్వం పై ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలకులు ఈ నిర్బంధాలను ఆపకుంటే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు, ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు.