- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
దిశ, రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ, మండలం లో 74 మందికి లబ్ధిదారులకు చెక్కులు మంజూరయ్యాయి. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మెదక్ - ఎల్కతుర్తి నేషనల్ హైవే నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అంతకు ముందు కోనాపూర్ తండాలోని సేవాలాల్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. బోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహం నింపారు.
అనంతరం రామాయంపేట మండలం అక్కన్న పేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రామాయంపేటలోని కాశీ గుట్ట మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర పర్సన్ పుట్టి విజయలక్ష్మి, రామాయంపేట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, తహసీల్దార్ శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.