ఆ సభను విజయవంతం చేయండి.. టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపు: ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

by Vinod kumar |
ఆ సభను విజయవంతం చేయండి.. టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపు: ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
X

దిశ, మల్దకల్: ఈ నెల 8వ తేదీన వనపర్తి జిల్లాలో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలించి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మల్దకల్ మండల కేంద్రంలో కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.



అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తేదీ 6, 7 ,8 మూడు రోజులు మహిళా బంధు వేడుకలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, PACS చైర్మన్ తిమ్మారెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాద రావు, సర్పంచ్ యాకోబు, వైస్ ఎంపీపీ వీరన్న, మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ విష్ణు, మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సింగల్ విండో డైరెక్టర్స్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story