- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా: చేవెళ్ల ఎమ్మెల్యే
దిశ, చేవెళ్ల: గుడ్డి ఎద్దు వచ్చి అంగడిని చెడగొట్టినట్లుంది మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం వ్యవహారం అని, చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ అతనికే వస్తుందని చెప్పుకోవడం విడ్డురంగా ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గత రెండేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేపట్టింది. నీవు సభ్యత్వం చేపించినవా ఎక్కడ చేపించినవ్.?, నీవు సభ్యత్వం ఎక్కడ తీసుకున్నావ్? నేను వందల ఎకరాల భూమి ఎక్కడ కబ్జా చేసినా? నీవు నిరూపించగలవా? అంటూ కె.ఎస్. రత్నంకు ప్రశ్నల వర్షం కురిపించారు.
సురభి వెంచర్ వాళ్లను బెదిరించి 2 వేల గజాలను కబ్జా చేయలేదా..?, తొల్కట్ట గ్రామంలో 140సర్వేలోగల పెరియాట్స్ ప్రభుత్వని రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకోలేదా, అలాగే కేతిరెడ్డిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 90 లో భూమిని నీ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయలేదా ఇది నిజం కదా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే..
నేను ఎమ్మెల్యేగా ఉంటూ ఒకగుంట ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని అన్నారు. అలాగే తాను వందల ఎకరాలు అక్రమంగా సంపాదించానని నిరూపిస్తే దానిని నియోజకవర్గంలోని పేద ప్రజలకు పంచుతానున్నారు. తన నాన్న పేరు మీద 9 ఎకరాల భూమి, తన భార్య పేరు మీద 5 ఎకరాల భూమి, తన పేరు మీద 1992-93లో ప్రభుత్వం తనకు 5 ఎకరాల భూమి ఇచ్చిందని అన్నారు. దానిని తాను ఎలక్షన్ అఫిడవిట్ లో జతచేశాను అని పేర్కొన్నారు. తన వద్ద వందల ఎకరాల భూమి లేదన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. బట్ట కాల్చి మీద వేస్తే ఊరుకునేది లేదన్నారు.
చేవెళ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా
చేవెళ్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో షాబాద్ మండలంలో చందన్ వెళ్లి, హైతబాద్, మంచన్ పల్లి, ఏరియాలో వెలస్పన్, అమెజాన్, కాటేరా, కుందన, శంకర్ పల్లి మండలంలోని కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను వేయించి యువతకు, ఉద్యోగ, ఉపాధి కల్పించిన విషయని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను దగ్గర ఉండి మరీ అందిస్తున్నాని ఆయన అన్నారు.