- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏం తమాషాలు చేస్తున్నారా...? గరీబోళ్ల జోలికొస్తే ఖబర్దార్
దిశ, సదాశివపేట: గరీబోళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే ఆగ్రో ఫార్మా కంపెనీ యాజమాన్యాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం సదాశివపేట మండప మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తాలోని ఫంక్షన్ హాల్ లో జరిగే వివాహానికి జగ్గారెడ్డి హాజరు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పిఎస్ఎంఎల్ కార్మికులు జగ్గారెడ్డిని కలిసి వారి గోడును వినిపించారు. తాము 40 సంవత్సరాలుగా పరిశ్రమలో కార్మికులుగా పనిచేశామని, ఇప్పుడు పరిశ్రమ మూతపడడంతో తమ బతుకులు దుర్భరంగా మారాయని బాధ వినిపించారు. కార్మికులు నివసిస్తున్న క్వాటర్స్ ను పరిశ్రమను కొనుగోలు చేసిన ఆగ్రో ఫార్మా కంపెనీ యాజమాన్యం జేసీబీతో కూల్చివేస్తుందని తమ బతుకులు రోడ్డున పడ్డాయని మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జగ్గారెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పిఎస్ ఎమ్మెల్ కంపెనీని కొనుగోలు చేసిన ఆగ్రో కంపెనీ యాజమాన్యం అనిరుద్ రెడ్డి, సుధీర్ రెడ్డిలను ఫోన్లో హెచ్చరించారు.
గరీబోళ్ల జోలికి వస్తే ఖబడ్దార్...
గరీబోళ్ళు నివసిస్తున్న ఈ పరిశ్రమ క్వార్టర్స్ లో 40 ఏళ్ల నుంచి ఉంటున్నా వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జేసీబీలతో క్వార్టర్స్ ను కూల్చి చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. మర్యాదగా కూల్చివేతను నిలిపివేసి ఎవరి ఇళ్లలో వారు ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కార్మికులకు సెటిల్మెంట్ చేయకుండానే ఎలా కొంటారని ప్రశ్నించారు. బ్యాంకు లోను ఉండగా కొన్నవారికి బ్యాంక్ అధికారులు ఎలా సెటిల్మెంట్ చేశారని నిలదీశారు. కొంతమంది రాజకీయ నాయకులు చిల్లర రాజకీయాలు చేసి స్వలాభం కోసం కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 రోజులుగా కార్మికులు ఉంటున్న కాలనీకి మంచినీళ్లు కరెంటు సరఫరాను నిలిపివేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. తక్షణమే కార్మికులకు నీళ్లు కరెంటు సరఫరా చేయాలని సూచించారు.
తమాషాలు చేస్తున్నారా...?
ఏం సుధీర్ రెడ్డి నీవు నీ పార్ట్నర్లు కార్మికులపై దౌర్జన్యాలు చేస్తూ తమాషాలు చేస్తున్నారా అని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది లోకల్ లీడర్లను సంకలో వేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. మీరు కోటీశ్వరులు అయితే నాకేం ఎవరైతే నాకేం ఎమ్మెల్యేగా పేద ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. బాధిత కార్మిక కుటుంబాలకు సెటిల్మెంట్ చేసి డబ్బులు ఇవ్వడం చేతకాదు గానీ యంత్రాలతో వారు ఉండే ఇండ్లను మాత్రం కూల్చివేస్తారా అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. గరీబోళ్లను బెదిరించి వెళ్లగొడతాం అని అనుకుంటే వారికి అండగా మేము ఉండి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు.
కార్మికులతో పోలీస్ స్టేషన్ వెళ్లిన జగ్గారెడ్డి..
పిఎస్ ఎంఎల్ క్వార్టర్స్ కూల్చివేతను అడ్డుకున్న జగ్గారెడ్డి కార్మికులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో పోలీసులతో మాట్లాడారు. అమాయకమైన కార్మికులపై ఆగ్రో ఫార్మా కంపెనీ చేసిన ఫిర్యాదు న్యాయం కాదని తెలిపారు. 40 సంవత్సరాల పాటు పనిచేసిన కార్మికులను వెళ్లగొట్టాలనే ఉద్దేశంతో ఆగ్రో ఫార్మా కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. దయచేసి పోలీసులు కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు కంది కృష్ణ, వీరన్న, సత్యనారాయణ కార్మికులు ఉన్నారు.