- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహిరంగ చర్చలకు వచ్చే దమ్ము కేసీఆర్‌కు ఉందా: ఈటల
దిశ, వెబ్‌డెస్క్: ఇందిరా పార్క్ వద్దనున్న ధర్నా చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ''ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష'' చేపట్టారు. అకారణంగా బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమే కాక, హైకోర్టు సూచనను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ గురువారం ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌పై దమ్ముంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు బహిరంగ చర్చలకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కుట్రతోనే నన్ను పార్టీ నుంచి కేసీఆర్ బయటకు పంపించారని ఆరోపించారు. అనంతరం ఉప హుజురాబాద్ ఎన్నికల్లో ఓడించేందుకూ అనేక కుట్రలు చేశారని అన్నారు. కేసీఆర్ అహంకార వైఖరిని పసిగట్టిన తెలంగాణ ప్రజానీకం నా విజయంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారని గుర్తుచేశారు. హుజురాబాద్ ఓటమికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలేదని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి, ప్రజాస్వామ్యాన్ని అవహస్యం చేశారని మండిపడ్డారు. 30 రోజులు జరగాల్సిన సమావేశాలను ఏడు రోజుల్లో ముగించి, చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.