- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srinivas Goud: హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోండి.. వారికి శ్రీనివాస్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని పబ్స్‌లలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు తేలడంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో డ్రగ్స్ అమ్మకాలు జరిపే పబ్స్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పబ్‌ల యజమానులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం సమావేశం అయ్యారు. డ్రగ్స్ అమ్మకాలు జరిపిన పబ్స్ యజమానులు హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోవాలని, మీరు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని, చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు.
అంతేగాకుండా, నిబంధనలు అతిక్రమిస్తున్న పబ్స్, రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్‌పై 30 రోజుల పాటు విస్తృత తనిఖీలు నిర్వహించి, సమయానికి మించి నడపటంతో పాటు అధిక శబ్ధాలతో పరిసర ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే, నగరంలోని పబ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, దీనికోసం ఓ నెల రోజుల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. సీసీ కెమెరాలు లేని పబ్స్ మూసివేయాలని తెలిపారు. దీనితో పాటు సీసీ కెమెరాల సర్వర్లను పోలీసు, ఎక్సైజ్ శాఖతో పంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు నిర్వహించే విచారణలో డ్రగ్స్‌తో ముడిపడి ఉన్న పబ్బులన్నీ మూసివేస్తామని చెప్పారు. మైనర్లకు పబ్‌లలోకి అనుమతి ఇస్తే సహించమని, అనుమానంగా ఉంటే ఆధార్ కార్డు నెంబర్ ద్వారా ఆన్లైన్‌లో చెక్ చేయాలని సూచించారు.