- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్‌లో వీణా-వాణి హవా.. ఫస్ట్ క్లాస్ సాధించి ఆదర్శంగా నిలిచిన అవిభక్త కవలలు
దిశ, ఫీచర్స్ : అవిభక్త కవలు వీణా-వాణి మరోసారి వార్తల్లో నిలిచారు. వైకల్యంతో బాధపడుతున్న వారు.. అనుకున్న కలను సాకారం చేసేందుకు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. చార్టెడ్ ఎకౌంటెట్స్ కావడమే వీరి లక్ష్యం కాగా.. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఈసీ గ్రూప్‌లో వెయ్యి మార్కులకు గాను వీణ 712, వాణి 707 మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.
పైగా ఎగ్జామ్స్ రాసే టైమ్‌లో ఎక్స్‌ట్రా వన్ హవర్ వినియోగించుకునే అవకాశమున్నా.. అందరిలాగే వారు కూడా మూడు గంటలు మాత్రమే పరీక్ష రాశారు. తమకు అదనపు సమయం అవసరం లేదని చెప్పారు.కాగా ఈ అవిభక్త కవలల కృషి, ప్రతిభకు ఫిదా అయిన తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కవలల ఉన్నత చదువులకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. వీణా, వాణిలకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
అవిభక్త కవలలు..వీణా వాణి లను అభినందించిన మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందున శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు. #veenavaani @SabithaindraTRS @SatyavathiTRS pic.twitter.com/th0BpSSYtH
— rudraram shekar (@shekarrudraram) June 29, 2022