Sabitha Indra Reddy: తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సబిత రియాక్షన్

by Nagaya |   ( Updated:2022-07-05 10:36:44.0  )
Minister Sabitha Indra Reddy Responds to Teegala Krishna Reddy Allegations on her
X

దిశ, వెబ్​డెస్క్​ : Minister Sabitha Indra Reddy Responds to Teegala Krishna Reddy Allegations on her| మంత్రి సబితా ఇంద్రారెడ్డి అరాచకాలకు పాల్పడుతోందని, ఆమె మీర్ పేటను నాశనం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తీగల కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సబిత.. తీగల అలా ఎందుకు మాట్లాడారో తెలియదని అన్నారు. ఆరోపణ విషయంలో తమ పార్టీ పెద్దల వద్ద మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి భూకబ్జాలకు పాల్పడుతోందన్న కామెంట్స్ పై సబితా స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం భూకబ్జాలను ప్రోత్సహించదని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారని చెప్పారు.

నిన్న మొన్నటి వరకు మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ తీగల కృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు అతంర్గతంగా కొనసాగినా మంగళవారం ఉదయం అకస్మాత్తుగా బహిర్గతం అయ్యాయి. సబితాపై తీగల కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఆమె టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలవలేదని, నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ విషయంలో తాను కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అక్కడ రాజకీయం హీటెక్కింది.

Advertisement

Next Story