ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సబితా

by S Gopi |
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సబితా
X

దిశ, బడంగ్​పేట్: బాంబుల మోత మోగుతున్న ఉక్రెయిన్ ఖర్కివ్​లో చిక్కుకున్న తన కుమారుడు జావేద్​ను రక్షించాలని, సురక్షితంగా ఇండియాకు తరలించాలని యువకుడి తల్లిదండ్రులు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆశ్రయించారు. దీంతో జల్​పల్లికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులతో శుక్రవారం మంత్రి విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాల్ లో​మాట్లాడి భరోసా కల్పించింది. మీ వెంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ సురక్షితంగా ఇండియాకు తీసుకువస్తామని, ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని మంత్రి అభయమిచ్చారు.

వివరాలలోకి వెళితే ...మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీ షాహీన్ నగర్ కు చెందిన మసిహుద్దీన్ కుమార్తె సుమయ్య, కుమారుడు జావేద్ లు ఉక్రెయిన్ లోని నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, వి ఎన్ కారజిన్ నేషనల్ యూనివర్సిటీ ఖర్కివ్ లలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఖర్కివ్ ప్రాంతంలో రష్యా బాంబుల మోత మ్రోగించడంతో బంకర్​లలో తలదాచుకున్నాడని .. తన కుమారుడిని రక్షించాలని ఆ విద్యార్థి తల్లి దండ్రులు మంత్రికి మొర పెట్టుకున్నారు. అయితే వీరికి పూర్తి సహాయసహకారాలు ప్రభుత్వం అందిస్తుందని, ఒక్క పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటికి చేర్చటానికి కృషి చేస్తామన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుండి ప్రత్యేకంగా ఢిల్లీకి తరలించి అక్కడ తెలంగాణ భవన్ లో వీరికి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుండి జల్ పల్లిలో ఇంటికి ప్రభుత్వం సురక్షితంగా చేరేలా చూస్తాందన్నారు.

Advertisement

Next Story