- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలి: మంత్రి మల్లారెడ్డి
దిశ, మేడ్చల్ టౌన్: మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతియేటా స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కల్యాణోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదవ సోదరులు ఘనంగా స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధార్మిక కార్యక్రమాలు ప్రజలను సన్మార్గంలో నడిపిస్తాయి అన్నారు. ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా కరోనా పీడ నుంచి బయటపడి, సుఖ సంతోషాలతో జీవించాలని మల్లికార్జున స్వామి వేడుకొన్నట్టు తెలిపారు.
కాగా మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి ఆలయ అభివృద్ధికి 71 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, యాదవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.