Minister Harish Rao: 'గత ఐదేళ్ల క్రితం ఇలాగే జరిగింది.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

by GSrikanth |   ( Updated:2022-07-25 10:46:11.0  )
Minister Harish Rao Issues Orders to Collectors to Contain spread of seasonal diseases
X

దిశ, వెబ్‌డెస్క్: Minister Harish Rao Issues Orders to Collectors to Contain spread of seasonal diseases| రాష్ట్రంలో వర్షాలు తగ్గినా.. సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. సోమవారం రాష్ట్రంలో ప్రభలుతున్న సీజనల్ వ్యాధులపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... గత ఐదేళ్ల క్రితం ఇలాగే డెంగ్యూ వ్యాధి విజృభించిందని, ప్రస్తుతం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా వ్యాధి ప్రభలుతుందని వీటిపట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు పెరగకుండా అన్ని జిల్లాల్లో ఇప్పటికే కిట్స్ అందుబాటులో ఉంచామని తెలిపారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందని అన్నారు. ప్రజలందరూ తమ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్లో మిడ్ డే మిల్స్‌ క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అంతేగాక, కరోనా మహమ్మారి సమస్య ఇంకా వెంటాడుతోందని, ప్రజలందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. కువైట్ నుండి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తికి కొన్ని మంకీఫాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇబ్రహీం శాంపుల్స్‌ను టెస్టుల నిమిత్తం పూణెకు పంపించినట్లు తెలిపారు. తెలంగాణలో ఒక్క కేసు మాత్రమే నమోదు అయిందని, అది కూడా ఇంకా పూర్తిగా అధికారికంగా నిర్ధారణ కాలేదని అన్నారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌కు కొత్త సమస్య.. కథ అడ్డం తిరుగుతోందా?

Advertisement

Next Story

Most Viewed