Minister Harish Rao: 'బీజేపీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు'

by samatah |   ( Updated:2022-07-14 10:07:48.0  )
Minister Harish Rao Demands to Respond Kishan Reddy Over Paddy Procurement
X

దిశ, వెబ్‌డెస్క్: Minister Harish Rao Demands to Respond Kishan Reddy Over Paddy Procurement| వర్షాలకు వడ్లు మొలకెత్తుతున్న బియ్యం ఎందుకు కొంటలేరో బీజేపీ స్పష్టం చేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బీజేపీ నాయకులు బియ్యం తీసుకుంటామని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, నూకల నష్టాన్ని మేమే బరిస్తామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు. గురువారం మెదక్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. వర్షాలు, వరదలు తాజా పరిస్థితులపై మెదక్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా మీటియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, వడ్లు కొంటమని చెప్పిన బీజేపీ నేతల గొంతు ఇప్పుడు ఎందుకు ముగబోయిందో చెప్పాలన్నారు. బీజేపీ నేతలకు రైతుల వడ్లు వద్దు కానీ వారి ఓట్లు కావాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చిందని, మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. రైతుల పట్ల బీజేపీది ద్వంద వైఖరి అని అసలు వడ్లు కొంటారో లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయాలని అన్నారు. మొలకెత్తిన వడ్లను కొనాలని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తిరగాలన్నారు. బాయిల దగ్గర మీటర్లు పెట్టేందుకు నిరాకరించామని రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు ఆపారని అన్నారు. దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చిందని, రాష్ట్ర రైతాంగ ఆగ్రహానికి బీజేపీ నేతలు బలికాకతప్పదన్నారు.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం..?

Advertisement

Next Story