ప్రభుత్వ స్కూళ్లలో.. కార్పొరేట్ విద్య: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Vinod kumar |
ప్రభుత్వ స్కూళ్లలో.. కార్పొరేట్ విద్య: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, దేవరుప్పుల: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం దేవరుప్పుల మండలం చిన్నమడూర్ ప్రభుత్వ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలకు అవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మన గ్రామాల్లో ఉన్న పాఠశాలలు ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



అనంతరం గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశ్, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్రామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, పీఏసీఎస్ లింగాల రమేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, జిల్లా యువజన నాయకుడు కోతి ప్రవీణ్, నియోకవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, చిన్నమడూరు గ్రామ సర్పంచ్ వంగా పద్మా వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ గొడుగు సుజాత మల్లిఖార్జున్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింతా రవి, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ నవీన్ నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాచర్ల బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story