- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Megastar Chiranjeevi: నాగార్జున-అఖిల్‌పై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) చేతుల మీదుగా నిన్న (అక్టోబరు 28)టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఏఎన్నార్ నేషనల్ అవార్డు(National Award) అందుకున్నారు. ఈ ఈవెంట్ కు చాలా మంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు (Tollywood film celebrities) హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున(Nagarjuna)-అఖిల్(Akhil) పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో చిరుకు నాగేశ్వరరావు (Nageswara Rao) మీద అమితమైన ప్రేమ ఉండేదని తెలిపారు. అలాగే ఇప్పుడు ఆ ప్రేమ, అభిమానం మళ్లీ నాగార్జున మీద కలిగిందని మెగాస్టార్ వెల్లడించారు. నాగ్ ఆయనకు ఎంతో ఇన్స్ఫిరేషన్ అని, ఆయన ఇప్పటికి యంగ్ గా ఉంటారని, అందుకోసం నాగార్జున పాటించే ఆరోగ్య సూత్రాలు ఎక్సర్సైజ్ చేయడం.. ఆయన ఆరోగ్యంపై చూపించే శ్రద్ధ చిరుకు ఎంతో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
నాగ్ కేవలం ఒక బ్రదర్, ఫ్రెండ్ మాత్రమే కాదు డాక్టర్ కూడా అని తెలిపారు. ఈ దేవుడు ఇచ్చిన మంచి స్నేహితుడ్ని లైఫ్ లో అస్సలు వదులుకోనని, ఒక అద్భుతమైన ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. అలాగే అఖిల్ చిరంజీవికి మరో కొడుకు అని వ్యాఖ్యానించారు. అఖిల్ చిరును పెద్దనాన్న పిలుస్తాడని.. అలా పిలిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందని.. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ చూపించే ప్రేమకు నేను దాసుడిని అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చిరు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.