మిస్టరీ & అడ్వెంచర్స్‌గా ‘నాగబంధం’.. క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి

by sudharani |   ( Updated:2024-10-14 14:30:55.0  )
మిస్టరీ & అడ్వెంచర్స్‌గా ‘నాగబంధం’.. క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా (Abhishek Nama) అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ 'నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్'. అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 1 గా కిషోర్ అన్నపురెడ్డి నిర్మించనున్నారు. తారక్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ (Virat Karna) లీడ్ రోల్ పోషిస్తుండగా.. నభా నటేష్ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్ (Aishwarya Menon), జగపతి బాబు (Jagapati Babu), జయప్రకాష్ (Jayaprakash), మురళీ శర్మ (Murali Sharma), బి.ఎస్. అవినాష్ (B.S. Avinash) ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ అంచనాలతో తెరకెక్కతున్న ఈ చిత్రం తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముహూర్తం షాట్‌కి క్లాప్‌ కొట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ తిరుగుతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మ్యాజిక్ మిస్టరీ, అడ్వెంచర్ సినిమా 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నెల 23న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ అనౌన్స్ చేశారు.

Advertisement

Next Story