- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదువులకు పెద్ద పీట వేసిన సీఎం కేసీఆర్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
దిశ, దుబ్బాక: మండలంలోని రాంపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటుతో.. దేశంలోనే చరిత్ర సృష్టించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. గురుకుల పాఠశాలలోని భోజనశాలను, తరగతి గదులను ఆయన పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సాంఘీక సంక్షేమ, మైనారిటీ, బీసీ హాస్టళ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన బడి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ చొరవతోనే దొడ్డు బియ్యం స్థానంలో గురుకుల పాఠశాలలకు, అంగన్వాడీ, పాఠశాలలకు సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలలో క్రీడా వేదిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చందాపూర్ లో అనారోగ్యంతో బాధపడుతున్న సర్పంచ్ బొడ్డు నర్సింహులు తండ్రిని ఆయన పరామర్శించారు.