Guinness world Records: గిన్నిస్ రికార్డు సాధించిన మేక.. ఎందులో అంటే?

by D.Reddy |
Guinness world Records: గిన్నిస్ రికార్డు సాధించిన మేక.. ఎందులో అంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోని అరుదైన, ప్రత్యేకమైన విషయాలను గిన్నిస్ వరల్డ్ రికార్డులో లిఖిస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రపంచంలోని అతి పొట్టి, పొడవైనా వ్యక్తులు గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ కేటగిరిలో ఓ బుజ్జి మేక కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డును (Guinness world Records) సాధించింది. ప్రపంచంలోనే అతి చిన్న మేకగా ప్రపంచ రికార్డును సృష్టించింది.

కేరళలోని( Kerala ) ఓ చిన్న పల్లెటూరుకు చెందిన పీటర్ లెన్ను అనే రైతు పిగ్మీ జాతి మేకను ( Pygmy goat ) పెంచుకుంటున్నాడు. దానికి కరుంబి అనే పేరు పెట్టాడు. ప్రస్తుతం దీని వయస్సు నాలుగేళ్లు. సాధారణంగా ఈ జాతికి చెందిన మేకలు 21 అంగుళాల కంటే పొడవుగా పెరగవు. అయితే, కరుంబి పొడవు 40.50 సెంటీమీటర్లు మాత్రమే. అందుకే ఇది నిజంగా ప్రత్యేకమైన మేకగా ఘనత సాధించింది. మేకకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గిన్నిస్ రికార్డు పుస్తకంలో నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని పలువురు సూచించారు. దీంతో అతను పశువైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆ దిశగా ప్రయత్నించగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ప్రస్తుతం ఈ చిన్న మేక గర్భవతిగా ఉంది. ఈ నేపథ్యంలో దాని పిల్లలు కూడా పొట్టిగా ఉంటారని.. అవి కూడా కొత్త రికార్డు సృష్టించగలవని భావిస్తున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story