TG Assembly: వెయ్యి జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రారు.. బీఆర్ఎస్‌పై రాజగోపాల్ రెడ్డి ఫైర్

by Shiva |   ( Updated:2025-03-26 09:28:01.0  )
TG Assembly: వెయ్యి జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రారు.. బీఆర్ఎస్‌పై రాజగోపాల్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మరో వెయ్యి జన్మలెత్తినా రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) మళ్లీ అధికారంలోకి రాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రాష్ట్రాన్ని అర్ధికంగా సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు. తమ ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)కు చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడు విచ్చలవిడిగా ఇసుక దందాకు పాల్పడి రూ.వేల కోట్లు వెనకేసుకున్నాడని కామెంట్ చేశారు. ఎక్కడిపడితే అక్కడి భూములను కబ్జాలు, సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చాక ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు.

ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అంతే కానీ.. రోజు అసెంబ్లీలో లొల్లి పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అధికారంలో ఉన్న నాడు.. అసెంబ్లీ (Assembly)లో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి మార్షల్స్‌ను పెట్టి బలవంతంగా బయటకు పంపారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నటికైనా ధర్మమే గెలుస్తుందని.. నేడు ఆ ధర్మం నిలబడిందే కాబట్టే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడిందని అన్నారు. మరో వెయ్యి జన్మలెత్తినా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. తమ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంచోడు కాబట్టి గత 15 నెలల నుంచి బీఆర్ఎస్ నాయకులు ఫాంహౌజ్‌లో ప్రశాంతంగా పడుకున్నారని.. నిన్నటి దాక ఒక లెక్క.. రేపటి నుంచి ఒక లెక్క అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.

Next Story

Most Viewed