- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోడ్డు తవ్వేశారు పైప్ లైన్ వేయడం మరిచారు..

దిశ, చౌటకూర్ : ఏదైనా పని మొదలు పెడితే దాన్ని అనుకున్న విధంగా పూర్తి చేయాలి. కానీ కొంత మంది అధికారుల వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. మండల కేంద్రమైన చౌటకూర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డును కొన్ని మరమ్మతుల కోసం తవ్వేసి ఆ తర్వాత దానిని అలాగే వదిలేశారు. దీంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అటుగా వెళుతున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి వేళలో గుంతలు కనిపియ్యకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గ్రామంలోనికి మురికి నీరు వెళ్లేందుకు ఉన్న పైపులైన్ తవ్వించి కొత్తగా మరో రెండు పైపులను వేసేందుకు సర్వీస్ రోడ్డు వద్ద గుంతలను తీసి కొత్త పైప్ లైన్ వేయకుండా వదిలేశారు. ఈ పనిచేసి 8 నెలలు గడుస్తున్నా తొవ్విన పైప్ లైన్ స్థానంలో మరో రెండు పైపులైన్లు ఏర్పాటు పూర్తి కాక వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే వ్యవసాయ పొలాలకు ఎడ్ల బండ్ల పై వెళ్లే అన్నదాతలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తొవ్విన చోట మరమ్మతులు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.