- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Intermediate Results-2025:ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate exams-2025) నిన్నటితో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు(Students) హాజరయ్యారు. తెలంగాణ(Telangana) లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5వ తేదీన ప్రారంభమై.. 25 వరకు కొనసాగాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో అన్ని సబ్జెక్టుల వారీగా పరీక్షలు మంగళవారం ముగియడంతో.. విద్యాశాఖ(Education Department) అధికారులు పేపర్ వాల్యుయేషన్ పై దృష్టి పెట్టారు.
ఇప్పటికే కొన్ని సబ్జెక్టుల పరీక్షలు మార్చి 20వ తేదీన ముగిశాయి. దీంతో కొన్ని పేపర్ల వాల్యుయేషన్(Paper valuation) ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల(ఏప్రిల్) చివరి వారంలో విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఎప్‌సెట్ ప్రారంభం కానుంది. అందువల్ల ఆ పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు మూడు రోజుల ముందు అంటే నాలుగో వారంలో ఫలితాలు(Results) విడుదల చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.