వామ్మో.. భారీగా పెరిగిన మాంసం ధరలు... కేజీ ధర ఎంతో తెలుసా?

by S Gopi |
వామ్మో.. భారీగా పెరిగిన మాంసం ధరలు... కేజీ ధర ఎంతో తెలుసా?
X

దిశ, నిర్మల్ కల్చరల్: చక్కగా ముక్కతో భోంచేద్దామంటే ఇప్పుడు మాంసం ధరలు సైతం మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే మాంసంముక్క ముడితే ధరల వేడి సెగ తగులుతోంది. మటన్‌ ధరలు ఆల్రెడీ హైలో ఉండగా, ఇప్పుడు కోడి కూర ధర కూడా కొండెక్కింది. మార్కెట్ లో మాంసం ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో మాంసాహారప్రియులు హడలిపోతున్నారు. నిర్మల్ జిల్లాలో చికెన్, మటన్ ధరలు గడిచిన నెలరోజులుగా క్రమంగా పెరిగిపోతుండడంతో మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి ఎదురవుతోంది. నిర్మల్ జిల్లాలో కిలో చికెన్ రేటు రూ. 300 పలుకుతోంది. అదే తరహాలో కిలో మేక మాంసం ధర రూ.700-800 ఉంది. వేసవికాలం కావడంతో పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు కోళ్ల పెంపకందారులు హోల్ సేల్ రేట్లు పెంచడం మూలంగానే రిటైల్ చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెపుతున్నారు. దేశీకోడి మాంసం ధర కూడా రూ.700 కు చేరువగా ఉంది. ఇక వేసవి కాలం నేపథ్యంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, జాతరలు అధికంగా ఉండడంతో మేకలు, గొర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో నెలరోజుల క్రితానికి ఇప్పటికీ మాంసం ధరలో కిలోకి సుమారు రూ.200 పెరిగిపోయిందని ప్రజానీకం అంటున్నారు. ఇక హోళీ పండగ నేపథ్యంలో జిల్లాలో కోళ్లు, మేకలు, గొర్లకు భారీ గిరాకీ ఏర్పడింది.

ఇకచూపు చేపలవైపు..

మాంసాహార ప్రియులు చికెన్, మటన్ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో చేపల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. చేపల ధరలు కిలోకి రూ.120-150 కే అందుబాటులో ఉండడంతో వీటివైపు ప్రజలు ఆసక్తిచూపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed