ఫ్లాష్.. ఫ్లాష్.. మళ్లీ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. ఈసారి ఎంతో తెలుసా..?

by Nagaya |   ( Updated:2022-03-28 07:45:21.0  )
ఫ్లాష్.. ఫ్లాష్.. మళ్లీ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. ఈసారి ఎంతో తెలుసా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రజారవాణ సంస్థ ఆర్టీసీ రోజుకో షాక్ ఇస్తోంది. పెరిగిన పెట్రో ధరలతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్న వేళ.. ప్రజలు ఆర్టీసీ వైపు మళ్లుతున్న సమయంలో మరోసారి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రౌండప్ పేరుతో కొన్ని రూట్లలో ఛార్జీలను పెంచిన ఆర్టీసీ.. టోల్ ధరను కూడా పెంచింది. అయితే, తాజాగా, ప్యాసింజర్స్ సెస్ పేరిట అధికంగా వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story