- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2022-23లో 6 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించడమే లక్ష్యం: మారుతీ సుజుకి!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ విభాగంలో 4-6 లక్షల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా ఉన్నట్టు వెల్లడించింది. గత నెలతో ముగిసిన 2021-22లో కంపెనీ మొత్తం 2.3 లక్షల సీఎన్‌జీ కార్లను విక్రయించింది.
ఈ క్రమంలో కార్ల తయారీలో కీలకమైన పరికరాల సరఫరాను బట్టి 4-6 లక్షల యూనిట్లను అమ్మాలనుకుంటున్నట్టు కంపెనీ సీనియర్ అధికారి ఆదివారం ప్రకటనలో తెలిపారు. మారుతీ సుజుకి ప్రస్తుతానికి తన 15 మోడళ్లలో తొమ్మిదింటిని సీఎన్‌జీ విభాగంలో విక్రయిస్తోంది.
రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ ద్వారానే అన్ని మోడళ్లను అమ్మాలని భావిస్తోంది. అయితే, వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలకమైన విడిభాగాల సరఫరాను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ తాము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా 4 నుంచి 6 లక్షల సీఎన్‌జీ వాహనాలను అమ్మకాలని చూస్తున్నామని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఇప్పుడు 17 శాతం సీఎన్‌జీ వాహనాలే ఉన్నాయి.
తక్కువ ధర, పెరుగుతున్న ఇంధన ధరల మధ్య వినియోగదారులు ఎక్కువగా సీఎన్‌జీ వాహనాలను ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము 2016-17లో 74 వేల సీఎన్‌జీ కార్లను విక్రయించాం. ఆ తర్వాత 2018-19లో లక్షల యూనిట్లు, 2019-20లో 1.05 లక్షల యూనిట్లు, 2020-21లో 1.62 లక్షల యూనిట్లను చేరుకున్నాం. దేశంలో సీఎన్‌జీ ఇంధన నెట్‌వర్క్‌ను వేగవంతంగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.