- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: మొదలైన పెళ్లి పనులు.. వర్క్ పక్కన పెట్టేసి శోభిత ధూళిపాళ ఇంటికి వెళ్లిన సమంత
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala)నిశ్చితార్థం ఆగస్టు 8న జరిగిన విషయం తెలిసిందే. కానీ పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇక వీరిద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చైతు పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో.. తాజాగా, శోభిత పెళ్లికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలైనట్లు తెలుపుతూ పసుపు కొట్టే ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అయితే ఈ కార్యక్రమంలో శోభిత కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. అలాగే నిశ్చితార్ధానికి దూరంగా ఉన్న శోభిత చెల్లెలు సమంత(Samantha) కూడా హాజరైంది.
అక్క పెళ్లి వేడుకలకు హాజరు కావడానికి అన్ని పనులు పక్కన పెట్టి విదేశాల్లోంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఇదే వార్త నెట్టింట వైరల్ కావడంతో అంతా నాగచైతన్య మాజీ భార్య సమంత వెళ్లిందని అనుకుంటున్నారు. కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), నాగచైతన్య ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొద్ది కాలానికి పెళ్లి చేసుకుని వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక చైతు రెండో పెళ్లి శోభితను చేసుకుంటున్నాడు. కానీ సమంత మాత్రం పెళ్లి చేసుకోకుండా పలు యాడ్స్, సినిమాల్లో నటిస్తూ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది.