ఆదివాసీ మహిళలను అణచివేస్తున్న మావోయిస్టులు: ఎస్పీ సునీల్ దత్

by Mahesh |
ఆదివాసీ మహిళలను అణచివేస్తున్న మావోయిస్టులు: ఎస్పీ సునీల్ దత్
X

దిశ, కొత్తగూడెం: ఫాసిస్ట్ నిషేధిత తీవ్రవాద మావోయిస్టు పార్టీ కి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పై కనీస మర్యాద, నైతిక వైఖరి లేదని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. గిరిజన మహిళలు, బాలికలపై మావోయిస్టులు అనేక రకాల వేధింపులకు పాల్పడుతూ.. వారిని అణచివేతకు గురి చేస్తున్నారన్నారు. గిరిజన బాలికలకు చదువుకునే అవకాశం ఇవ్వడం లేదు. వారిని మావోయిస్టు పార్టీలో చేరాలని ఒత్తిడికి చేస్తున్నారని.. గిరిజన యువతులను మావోయిస్టు నాయకులు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్న రన్నారు.

మావోయిస్టులు వారికి సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించడం లేదు. అనేక మంది మహిళలకు మావోయిస్టులు బలవంతంగా అబార్షన్ చేయించారని దండకారణ్యంలో మహిళలను మావోయిస్టులు ఒక ఆటబొమ్మలా వాడుకుంటూ, వారి అభివృద్ధికి అడ్డు పడుతున్నారన్నారు. అమాయకులైన ఆదివాసీ మహిళల పై బలవంతంగా మావోయిస్టు సిద్ధాంతాలు రుద్దుతూ, వారిని బాహ్య ప్రపంచానికి దూరం చేస్తున్నారని ఎస్పీ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed