బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. రివార్డు మావోయిస్టు మృతి

by samatah |   ( Updated:2022-03-11 04:56:11.0  )
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. రివార్డు మావోయిస్టు మృతి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం కైకా - మౌస్లా గ్రామాల నడుమ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించారు. ఎదురుకాల్పుల్లో జవాన్ రామ్లు హేమ్లా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూబింగ్ నిర్వహిస్తున్న డీఆర్‌జీ, కోబ్రా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడు, సాండ్రా లాస్ డిప్యూటీ కమాండర్ పూనెం రితేష్‌గా గుర్తించారు. ఇతనిపై రూ 3 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన ప్రాంతంలో ఒక ఆయుధం, పిస్టల్, నక్సల్ మెటీరియల్, రోజువారీ వినియోగ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన హత్యలు, దహనం, దోపిడీ ఘటనల్లో ఇతడు పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed