- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mango Price: ప్రస్తుతం మామిడి పండ్ల ధర తెలిస్తే షాకే...!
దిశ, వెబ్ డెస్క్: రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకముందే ఈ ఏడాది మామిడి రైతులను నిండా ముంచేలా ఉంది. ఈ సమయానికి చెట్టు నిండా కాయలతో నిగనిగలాడాల్సిన తోటలు పూత, కాతా లేకుండా రైతుల్ని వెక్కిరిస్తున్నాయి. రూ. లక్షలు వెచ్చించి పురుగుమందులు జల్లినా ఫలితం లేకుండా పోయింది. సాధారణ దిగుబడితో పోల్చుకుంటే సగం పంట కూడా చేతికందని దుస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదని చెబుతున్నారు మామిడి పండ్ల రైతులు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గత యేడాది కంటే ఇప్పుడు చాలా రేటు పలుకుతోంది. టన్ను మామిడి రూ. 70 వేల నుండి లక్ష రూపాయలు చేరే ఆవకాశముంది. ఊహించని రేట్లో మామిడి పండ్ల ధరలు పెరిగాయి. వర్షలు ఎక్కువ లేకపోవడంతో మామిడి తోటలు 50 శాతం దెబ్బతిన్నాయి. ఈ ఏడాది వాతావరణ మార్పులతో తోటలు ఎండల వల్ల ఎండిపోతున్నాయి. ఏప్రిల్ రెండోవారంలో కూడా మార్కెట్ లో మామిడి తరలిరావడంలేదని వ్యాపారులు తెలిపారు. మామిడి కాయ సైజు చూసి తీసుకుంటే మరింత రేటు పెరిగే అవకాశలున్నాయని మార్కెట్ సిబ్బంది తెలిపింది.
ఇవి కూడా చదవండి : ఎండాకాలంలో అతిగా మామిడిపండ్లు తినొచ్చా ?