- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భిక్కనూరులో దారుణం.. 12 గంటల పాటు స్తంభంపై వేలాడిన మృతదేహం
దిశ, భిక్కనూరు : ఏబీ స్విచ్ రిపేర్ చేయబోయి విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి లక్ష్మీనగర్ తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బాబు అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద ఉన్న ఏబీ స్విచ్‌లు ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలో వాటిని బాగు చేయాలని తండాకు చెందిన లంబాడి పరశురాం(39 )ను ఆదివారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్ళాడు.
అయితే ఎల్‌సీ తీసుకోకపోవడమే కాకుండా, సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరా అవుతుందన్న ఈ విషయాన్ని మర్చిపోయి, విద్యుత్ స్తంభం ఎక్కి సరి చేయబోయాడు. ఈ లోపే విద్యుత్ షాక్ తగిలి స్తంభం పైనే మృతి చెందాడు. మృతుడు గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మృతునికి పిల్లలు ఉన్నారన్న ఉద్దేశంతో గ్రామస్తులు కొందరు.. మరమ్మతు చేయించేందుకు తీసుకెళ్లిన బాబు అనే రైతు వద్ద నుంచి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని కిందకు దించేది లేదంటూ భీష్మించారు.
మృతదేహం రాత్రి నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు స్తంభం పైనే వేలాడుతూ ఉంది. ఈ విషయం తెలిసిన భిక్కనూరు ఎస్ఐ(2) హైమద్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని స్తంభం పైనుంచి కిందికి దించే విధంగా ఒప్పించారు. మృతదేహాన్ని కిందకు దించినప్పటికీ పరిహారం విషయంలో రైతు బాబుకు, మృతుని తరఫున బంధువులు, కుటుంబ సభ్యులకు మధ్య సంప్రదింపులు కొలిక్కి రాలేదు. అయితే బాధితులు ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మృతునికి భార్య సుశీల, కుమారుడు, కుమార్తె ఉన్నారు.