Mamata Banerjee: వాస్తవాలు మాట్లాడే వారికి కేంద్రం వ్యతిరేకమని మమతా బెనర్జీ విమర్శలు

by S Gopi |   ( Updated:2022-06-27 15:00:29.0  )
Mamata Banerjee Asks Centre To Extend Retirement Age Of Agniveer to 65 years
X

కోల్‌కతా: Mamata Banerjee Asks Centre To Extend Retirement Age Of Agniveer to 65 years| పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. అగ్నివీరుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బెంగాల్ బుర్ద్వాన్ తో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం ఆమె మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. బీజేపీకి భిన్నంగా మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్నదే నా నినాదం. నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చి నాలుగేళ్ల వ్యవధికి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు.

నాలుగేళ్ల తర్వాత ఈ సైనికులు ఏం చేస్తారు? వారి భవిష్యతు ఏంటి? ఇది దురదృష్టకరం. అగ్నివీరుల పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పొడగించాలని నేను కోరుతున్నాను' అని అన్నారు. అగ్నిపథ్‌పై బీజేపీ వైఖరి చూస్తుంటే సొంత కేడర్ నిర్మించుకునేలా కనిపిస్తున్నదని ఆరోపణలు చేశారు. వాస్తవాలను మాట్లాడేవారిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లుగా బీజేపీ చేస్తున్నదని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు. మరోవైపు కేంద్రం ఇప్పటికే అగ్నివీరుల నియమాకానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed