- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఆఫీసులో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్‌పై మహేశ్వర శర్మ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మహేశ్వర శర్మ పంచాంగశ్రవణం చేసి, బీజేపీ నేతలకు వినిపించారు. ఈ సందర్భంగా మహేశ్వర శర్మ మాట్లాడుతూ.. 2028 మే 5 వరకు ప్రధాని మోడీకి తిరుగులేదని చెప్పారు. ప్రతిపక్షాలుకు ప్రభుత్వం ధీటుగా బదులిస్తోందని అన్నారు. ఈ ఏడాది ఆహార ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదని, మూడోసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాలను యావత్తు దేశం సమర్ధిస్తున్నదని, ఈ సంవత్సరం వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం.. ఖర్చు సమానంగా ఉంటుందని, గత మూడేళ్ళుగా ఉన్నట్లే ఉంటుందని వెల్లడించారు. వచ్చిన ఆదాయం కొందరి చేతుల్లోనే తిరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల బలం వలన ముఖ్యమంత్రి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోక తప్పదని హెచ్చరించారు. ఈ వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, విజయశాంతి, లక్ష్మణ్, స్వామిగౌడ్, గూడూరు తదితరులు పాల్గొన్నారు.